వకీల్ సాబ్‌కు పవన్ కళ్యాణ్ ఎంత రెన్యూమరేషన్ తీసుకున్నాడంటే?

Thursday, April 22nd, 2021, 09:00:57 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ మరియు ఓవరాల్ కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ మొత్తంగా రూ.65 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తంలో రూ. 50 కోట్లు ఆయన పారితోషికం కాగా, మిగతాది సినిమా బిజినెస్‌లో పర్సంటేజీగా తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే హీరోయిన్ నివేదా థాంస్ రూ.75 లక్షలు పారితోషికం తీసుకోగా, శృతిహాసన్, అంజలి చెరో రూ.50 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది.