పవన్ కోసం దిల్ రాజు వెయిటింగ్…ఇక పవన్ మేనియా మొదలయ్యేనా?

Sunday, May 24th, 2020, 06:50:21 PM IST


వకీల్ సాబ్ చిత్రం అనుకున్నట్లుగా చిత్రీకరణ పూర్తి అయినట్లు అయితే మే 15 న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ వేగంగా వ్యాప్తి చెందడం, లాక్ డౌన్ ను అమలు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం రెండు నెలలు లాక్ డౌన్ లో ఉంది పోయింది. తద్వారా సినిమా రంగం కుదేలు అయింది. ఎన్నో సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

అయితే ఈ నెలాఖరు తో లాక్ డౌన్ ముగిసే అవకాశం కనిపిస్తోంది. జూన్ మొదటి వారం నుండి సినిమా చిత్రీకరణ లకు, నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే వకీల్ సాబ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను డేట్స్ అడిగారు. జూన్ నెలలో సినిమా ను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ సహకరించాలని కోరారు. అయితే పవన్ దీనికి ఓకే అన్నారు.

పవన్ కళ్యాణ్ ఈ చిత్రం అనంతరం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అలానే దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు అంగీకరించారు. అయితే ఎన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ శరవేగంగా ఒక దాని తర్వాత మరొక చిత్రం చేస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం బ్లాక్ బస్టర్ అయిన పవన్ మేనియా మళ్లీ మొదలవ్వడం ఖాయమని తెలుస్తోంది.