పవన్ మళ్ళీ సినిమా చేస్తున్నాడోచ్… కథేంటో తెలుసా…?

Monday, October 14th, 2019, 11:53:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీరంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అతితక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని సినీపరిశ్రమలో నంబర్ వన్ స్థానికి ఎదిగిన సంగతి మనకు తెలిసిందే. కాగా ప్రస్తుతానికి సినిమాలని పక్కనబెట్టి ప్రజాశ్రేయస్సుకై రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల తరువాత ఇకమీదట సినిమాలు చేయబోనని నిర్ణయించుకున్నాడు. కానీ పవన్ రాజకీయాలతో పాటే సినిమాలలో కూడా బిజీగా ఉండాలని పవన్ అభిమానులతో పాటు పవన్ సన్నిహితులందరు కూడా కోరుకుంటున్నారు.

అయితే ఇపుడు కొత్తగా ఒక వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే… పవన్ మళ్ళీ సినిమా చేయబోతున్నారట. అది కూడా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రారంభించనున్నదంతా. అసలు విషయానికొస్తే… హిందీ లో సూపర్ హిట్ అయినటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దానికి గడ్డలకొండ గణేష్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారంట. కాకపోతే ఇది అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.