నేను విజయ్‌నే పెళ్లి చేసుకుంటా.. లైవ్ షోలో పాయాల్ సెన్షేష‌న్..!

Monday, October 29th, 2018, 10:15:36 AM IST

టాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో తెలుగు వెండితెర పై ఎంట్రీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్.. ఆ చిత్రంలో త‌న అందాల‌తో కుర్ర‌కారును పిచ్చెక్కించింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా అయిపోయిన యువ‌త త‌మ గుండెల్లో ఈ హాట్ భామ‌కి గుడి క‌ట్టేస్తున్నారు. తాను న‌టించిన తొలి చిత్రంలోనే లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన పాయ‌ల్ రాత్రికి రాత్రే మంచి క్రేజ్ సంపాదించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ‌కి టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చి ప‌డుతున్నాయి.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే పాయ‌ల్ తాజాగా ఓ బుల్లితెర షోలో పాల్గొంది. పాయ‌ల్‌తో పాటు ఆర్ఎక్స్ 100 చిత్రంలో హీరోగా నంటించి కార్తికేయ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ షోలో భాగంగా మీరు ఎవ‌రిని పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌శ్నించ‌గా… పాయ‌ల్ త‌ముడుకోకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అయితే ఇప్ప‌టికిప్పుడే పెళ్లి చేసుకంటాన‌ని చెప్పి ఒక్క‌సారిగా అంద‌రికీ షాక్ ఇచ్చింది పాయ‌ల్. దీంతో ఈ అమ్మ‌డి స్టేట్ మెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా టాలీవుడ్ సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మ‌రి పాయ‌ల్ వ్యాఖ్య‌లు విజ‌య్ వింటే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.