పీసీ పెళ్లి వేడుక ప‌క్కా డీటెయిల్స్

Friday, October 26th, 2018, 05:00:02 PM IST

36 వ‌య‌సు ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్ బోయ్‌ఫ్రెండ్ నిక్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ముంబైలో రోఖా (నిశ్చితార్థం) పూర్తి చేసుకుని సంబ‌రాల్లో మునిగి తేలింది. ఈ అనుబంధం పీసీ జీవితంలో ఎంతో హుషారు తెచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ పీసీ పెళ్లి వేడుక గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది.

ప్ర‌స్తుతం పీసీ లాస్ ఏంజెల్స్ లో నిక్ ఫ్యామిలీతోనే ఉంటోంది. లేటెస్టు స‌మాచారం ప్ర‌కారం పెళ్లి ఇట‌లీలో కాకుండా ముంబైలోనే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. న‌వంబ‌ర్ 13న సంగీత్‌, న‌వంబ‌ర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల ముచ్చ‌టైన‌ వివాహ వేడుక‌, 16వ తేదీన రిసెప్ష‌న్ ఉంటాయిట‌. ఆ త‌ర్వాత అతిధులుకు ఇంకేదైనా ఘ‌న‌మైన‌ పార్టీ చేయాల‌నుకుంటే డిసెంబ‌ర్ 1న ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇన్నాళ్లు ఇట‌లీ లేక్ -కోమోలో వెన్యూ బుక్ చేయాల‌ని ట్రై చేసి విసుగెత్తిపోవ‌డంతో ఈ పెళ్లి ముంబైలోనే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డైంది.

  •  
  •  
  •  
  •  

Comments