‘కత్తి’ యూనిట్ పై దావా

Tuesday, October 28th, 2014, 06:24:00 PM IST


ఇటీవల తమిళనాడులో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రం యూనిట్ పై మదురై కోర్టులో పరువునష్టం దావా వేయబడింది. వివరాలలోకి వెళితే కత్తి సినిమాలో ఒక డైలాగ్ పట్ల అభ్యతరం వ్యక్త చేస్తూ హీరో విజయ్, దర్శకుడు మురుగుదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పై మధురై మేజిస్ట్రేట్ కోర్టులో ఆర్ సుబ్రమణియన్ అనే న్యాయవాది పరువునష్టం దావా వేశారు. ఇక ఆ సినిమాలో 2జీ కుంభకోణాన్ని స్పృశిస్తూ ఒక డైలాగ్ ఉందని, అది జాతి ప్రయోజనాలు, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం వాటిల్లేలాగ ఉందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. అయితే ‘కేవలం తరంగాల (2జీ) సాయంతో కోట్లకు కోట్లు లూటీ చేసిన వ్యక్తులు ఉన్న దేశమిది’ అంటూ హీరో విజయ్ పలికిన ఈ డైలాగ్ పై సుబ్రమణియన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ పై పరువునష్టం దావాను వేశారు.