శ్రీరెడ్డి పై పోలీస్ కేసు – సాహసం చేసిన తెలుగు నటి…

Tuesday, February 18th, 2020, 11:40:07 PM IST

నిత్యం వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కాగా ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి పై ప్రముఖ తెలుగు నటి కరాటే కళ్యాణి నేడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే సామాజిక మాంద్యమాల్లో తనపై శ్రీరెడ్డి నిత్యం అసభ్యకర వాఖ్యలు చేస్తుందని ఆరోపిస్తూ కరాటే కళ్యాణి అనే నటి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై సైబర్ క్రైమ్ డిపార్టుమెంటు విచారణ చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా ఈమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా ప్రముఖ సామాజిక మాంద్యమాల్లో ఇతర వ్యక్తుల ప్రతిష్టకి భంగం కలిగించేలా, ఇలా కించపరిచేలా అసభ్యకరమైన కామెంట్స్, అనుచిత వాఖ్యలు చేయడం చట్ట రీత్యా నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.