అల్లు అర్జున్ అభిమానుల పై కేసు నమోదు…కారణం ఇదే!

Friday, April 9th, 2021, 09:32:16 AM IST

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు వందల సంఖ్య లో హైదరాబాద్ కి తరలి వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాకుండా, బాణసంచా కూడా కాల్చడం వివాదం గా మారింది. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్థరాత్రి బాణసంచా కాల్చడం తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ తో పాటు సంతోష్ అనే అభిమాని పై ఐపిసి సెక్షన్ 290,336, 188 కింద కేసు నమోదు చేశారు పోలిసులు. అయితే అక్కడే ఉంటున్న స్థానికులు నిద్ర కి ఆటంకం రావడం తో పోలీసులకి ఫిర్యాదు చేయగా, వారు పై కేసులు నమోదు చేశారు.