పోలీస్ కేసుల‌తో `ఆమె` ఉక్కిరి బిక్కిరి

Thursday, July 18th, 2019, 07:05:29 PM IST

`ఆమె` అందాల ఆర‌బోత స‌ర్వ‌త్రా హాట్ టాపిక్. త‌మిళ్ – తెలుగు- మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల‌కు సుప‌రిచిత‌మైన ఆమె న‌గ్న‌త్వం దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు? అంటే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె అమ‌లాపాల్. కెరీర్ తొలి నుంచి ప్ర‌యోగాల బాట‌నే ఎంచుకున్న ఈ అమ్మ‌డి డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ ప్ర‌తిసారీ హాట్ టాపిక్ గానే మారింది. భ‌ర్తను ఏమార్చి మామ‌తో రొమాన్స్ చేసే కోడ‌లుగా కెరీర్ ఆరంభ‌మే ఓ త‌ర‌హా బూతు సినిమాలో న‌టించి అమ‌లాపాల్ హాట్ టాపిక్ గా మారింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ అయ్యాక ఆ మ‌ర‌క‌ను చెరిపేసుకునేందుకు చాలా కాల‌మే ప‌ట్టింది. అటుపై ద‌ర్శ‌కుడు ఏ.ఎల్. విజ‌య్ ని ప్రేమించి పెళ్లాడి కేవ‌లం ఏడాది గ్యాప్ లోనే విడాకులివ్వ‌డంపైనా వాడి వేడిగా చ‌ర్చ సాగింది. ఇటీవ‌లే కేంద్ర పాలిత ప్రాంతంలో బెంజ్ కార్ కొని ప‌న్ను ఎగ్గొట్టిన కేసులోనూ అమ‌లా అన్ పాపుల‌ర్ అయ్యింది.

అవ‌న్నీ గ‌తం గ‌తః అనుకుంటే.. వ‌ర్త‌మానంలో వాట‌న్నిటినీ మించి జ‌నం చెవులు కోసుకుంటున్న మ‌రో హాట్ టాపిక్ `ఆమె` (ఆడై) సినిమా. అందాల ఆర‌బోత‌కు అడ్డూ ఆపూ అన్న‌దే లేకుండా అమ‌లాపాల్ చెల‌రేగి న‌టించింది ఈ చిత్రంలో. ఇప్ప‌టికే `ఆమె` టీజ‌ర్, ట్రైల‌ర్ సెన్సేష‌న్స్ గురించి తెలిసిందే. ఆమె చిత్రంలో బ్యాచిల‌ర్ పార్టీ సీన్ లో న‌గ్నంగా క‌నిపించేందుకు అమ‌లాపాల్ అడ్డు చెప్ప‌లేదు. మందు.. విందు.. పొగ తాగ‌డం.. వ‌గైరా వ‌గైరా యాక్టివిటీస్ తో అల్ట్రా మోడ్ర‌న్ గాళ్ పాత్ర‌లో బోల్డ్ గా చెల‌రేగిపోవ‌డంతో ఈ సినిమాకి సెన్సార్ నిర‌భ్యంత‌రంగా ఏ స‌ర్టిఫికెట్ ని ఇచ్చింది. ఈ శుక్ర‌వారం సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా రిలీజ్ ముంగిట మ‌హిళా మండ‌ళ్లు అమ‌లాపాల్ పై ఓ రేంజులో విరుచుకుప‌డుతుండ‌డం వేడెక్కిస్తోంది. ఈ చిత్రంలో అమ‌లా పాల్ బోల్డ్ వేషాలు అస‌భ్యంగా ఉన్నాయంటూ.. రాజేశ్వరి ప్రియ అనే మహిళ చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆడై చిత్రంలో న‌గ్న దృశ్యాలు ఉన్నాయి. పోస్ట‌ర్లు సంఘానికి కీడు చేసేవిగా క‌నిపిస్తున్నాయి. అందుకే సినిమాని రిలీజ్ కానీకుండా నిషేధించాలంటూ రాజేశ్వ‌రి ఫిర్యాదు చేశారు. ఒక‌వేళ పోలీసులు ఈ చిత్రంపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆందోళ‌న బాట ప‌ట్టేందుకు మ‌హిళా మండ‌ళ్లు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆమె హెచ్చ‌రించడంతో ఆడై రిలీజ‌వుతుందా లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే ఈ త‌ర‌హా కేసులు కేవ‌లం ఇదే కాదు.. చాలా సంద‌ర్భాల్లో అమ‌లాపాల్ ఇదే స‌న్నివేశాన్ని ఎదుర్కొంటోంది కాబ‌ట్టి తాను మాత్రం దీనిపై పెద్దంత‌గా వ‌ర్రీగా లేద‌ట‌. తాజా వివాదాల‌తో ఆమె (ఆడై) చిత్రానికి బోలెడంత ఫ్రీ ప‌బ్లిసిటీ క‌లిసొచ్చింది. ఇప్ప‌టికే యూత్ లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతోంది కాబ‌ట్టి .. అస‌లు అస‌భ్య‌త అన్న‌దే లేదు అని స‌మ‌ర్థించుకుంటున్న అమ‌లాపాల్ మాట‌ల్లో నిజం ఎంతో తేల‌నుంది. ఈ చిత్రం ఎంతో హార్డ్ హిట్టింగ్! అంటూ చిత్ర‌యూనిట్ ప్ర‌చారం సాగిస్తోంది. అందులో మ్యాట‌ర్ ఎంతో తేల్చేందుకు క్రిటిక్స్ రెడీ అవుతున్నారు.