లేటెస్ట్ న్యూస్: పూజ హెగ్డే కి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్!

Tuesday, February 11th, 2020, 12:02:08 PM IST

ఇప్పటివరకు పలు హిట్ సినిమాలు నమోదు చేసుకున్న పూజ హెగ్డే, అలా వైకుంఠపురంలో చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తరువాత పూజ హెగ్డే ఫేట్ మారిందని చెప్పాలి. బాలీవుడ్ లో సైతం ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఎక్కువ మొత్తం ఇచ్చి రైట్స్ కొనుక్కున్నారు. అయితే ఈ బుట్ట బొమ్మ క్రేజ్ ఎలా ఉందంటే శిల్ప శెట్టి లాంటి అగ్ర హీరోయిన్ ఈ చిత్రంలోని పాటలకు ఫిదా అయి తాజగా స్టెప్పులేశారు. ఈ చిత్రం కి అంతగా ఆదరణ ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ తో పాటుగా ఈ చిత్రానికి పూజ కు చాల పేరు తీసుకువచ్చింది.

అయితే పూజ హెగ్డే తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో సల్మాన్ సరసన నటించే అవకాశం దక్కించుకొంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే స్మాల్ టౌన్ గర్ల్ గా నటించనున్నది. అయితే పూజ హెగ్డే ఇదివరకు బాలీవుడ్ లో మొహంజదారో, హౌస్ ఫుల్ 4 చిత్రాలలో నటించినప్పటికీ అవి అంతగా పేరు తీసుకురాలేదు. అయితే పూజ హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరుస సినిమాలతో పూజ ఇక స్టార్ హీరోయిన్ రేస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నట్లేనని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.