వాల్మీకి లో పూజ హెగ్డే-వరుణ్ తేజ్ రొమాన్స్ అదుర్స్!

Tuesday, September 17th, 2019, 06:39:19 PM IST

వాల్మీకి చిత్రాన్ని తమిళ్ చిత్రం అయినా జిగర్తాండ కి రీమేక్ గా తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం లో హరీష్ శంకర్ పూజ హెగ్డే మరియు వరుణ్ తేజ్ ల మధ్య ఒక డ్యూయెట్ ని పెట్టారని అందరికి తెలిసందే. వెల్లువచ్చి గోదారమ్మ ఎల్లకిలా పడ్డాదమ్మా అని సాగె పాటలో వరుణ్ తేజ్- పూజ హెగ్డే ల రొమాన్స్ అదిరిపోనుందని టాక్.

శోభన్ బాబు, శ్రీదేవి కలయికలో అప్పట్లో వచ్చిన ఈ పాట, ఇప్పటికి ప్రజలని ఆకట్టుకుంటూనే వుంది. హరీష్ శంకర్ మెగా ఫామిలీ లో స్టార్స్ పాటల కంటే ఈ పాటనే ఎంచుకోవడానికి గల కారణం సినిమా చుస్తే మీకే అర్ధం అవుతాది అని ముందే తెలిపారు. కాగా ఈ పాటకి సంబందించిన కొన్ని స్టిల్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్-పూజ హెగ్డే ల పెర్ఫార్మన్స్ కూడా అదుర్స్ అని అంటున్నారు. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ తన విశ్వరూపాన్ని చూపనున్నాడు అని హరీష్ శంకర్ ఇటీవలే పేర్కొన్నారు.