సల్మాన్ నాపై అత్యాచారం చేశాడన్న బిగ్ బాస్ భామ ?

Sunday, October 14th, 2018, 10:26:36 AM IST

మీ టూ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంలో బాహాటంగా స్పందిస్తూ సంచలనం రేపుతున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కువగా బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లే వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై ఓ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది .. సల్మాన్ తనను రేప్ చేసాడని ఆమె చెప్పింది. అలా చెప్పిన నటి ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న పూజ మిశ్రా ? తనను లైంగికంగా సల్మాన్ , అయన సోదరులు అర్బాజ్, సోహైల్ లు వేధించారని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పూజ చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. సల్మాన్ ఖాన్ పైనే కాదు శత్రుజ్ఞు సిన్హా కుటుంబం పై కూడా ఆరోపనులు చేసింది ఈ భామ. సుల్తాన్ సినిమా సమయంలో ఓ హోటల్ లో తనపై రేప్ జరిగిందని కామెంట్స్ చేసింది. ఇప్పుడే ఈ ఉద్యమం మొదలైందని .. ఇకనుండి ప్రతి ఒక్కరికి తిప్పలు తప్పవని ఓ మహిళతో ఇలా ప్రవర్తించిన సల్మాన్ అతని సోదరులకు శిక్ష తప్పవని చెప్పింది పూజ !!