వైరల్ న్యూస్ : పూనమ్ మరో సంచలన ట్వీట్

Tuesday, December 10th, 2019, 10:13:04 AM IST

ప్రస్తుత కాలంలో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి పూనమ్ కౌర్.. తాను నటించిన సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా బాగా పేరు తెచ్చుకుందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు… ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో తనకు ఒకరకమైన సంబంధం ఉందని అప్పట్లో బాగానే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ ఎఫైర్ విషయంలో నటి పూనమ్ కౌర్ ఏనాడూ స్పందించలేదు. అయితే అప్పటినుండి పూనమ్ కౌర్, నటుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ, ఇప్పటికి కూడా కొన్ని సంచలన వాఖ్యలు చేస్తూనే వార్తల్లో బాగా కనిపిస్తుంది.

అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం పై పూనమ్ కౌర్ స్పందించిన సంగతి తెలిసిందే. కాగా ఉమెన్ కి సంబందించిన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్, ఇటీవల ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవి ని కలుసుకోవడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పూనమ్, ఆశాదేవితో ఉన్న ఫోటోని తన ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్నారు. కాగా ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగనుంది, ఆ రోజు మనదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది అని వాఖ్యానించారు.