గాసిప్స్ : మరో పవర్ ఫుల్ కాంబోలో పవర్ స్టార్..?

Thursday, February 27th, 2020, 03:12:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పాలిటిక్స్ మరియు సినిమాలు చాలా బ్యాలన్స్డ్ గా నడుపుకుంటూ వస్తున్నారు.తన రాజకీయ బిజీలో ఉంటూనే మరోపక్క ఒకదానిని మించి మరొకటి సినిమాలను కూడా ఒకే చేసేస్తున్నారు.అయితే ఇప్పుడు తన 26 వ చిత్రం “వకీల్ సాబ్” కోసం సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుండగా మరో పక్క పవన్ నటించబోతున్న తాజా చిత్రాలకు సంబంధించి పలు అప్డేట్ లు మాత్రం ఆగకుండా వస్తూనే ఉన్నాయి.

మొదటగా పవన్ మరియు క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.అలాగే దీనితో పాటు మరో అదిరిపోయే వార్త కూడా బయటకు వస్తుంది.పవన్ మరియు టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో సెట్ చేస్తున్నట్టు వినికిడి.ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యిపోయింది అని ఇంకా అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం.ఈ కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ కు మరోసారి మూడినట్టే అని చెప్పాలి.