పాలిటిక్స్ వల్ల పవన్ వెండి తెరకు దూరం ?

Tuesday, January 23rd, 2018, 08:40:56 AM IST

ప్రస్తుత రాజకీయాల్లో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగాలని అనుకుంటున్నాడు. సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామి నుంచి తన ప్రజా యాత్రను కొనసాగించిన పవన్ ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్ లో తనదైన శైలిలో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. అయితే పవన్ పాలిటిక్స్ వల్ల సినిమాల గురించి ఇక ఆలోచించనని ప్రస్తుతానికి పక్కన పెట్టేసానని తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం ఉన్న మెగా అభిమానుల్లో కొంచెం ఆందోళన నెలకొంది.

గత కొంత కాలంగా పవన్ సినిమాలను దూరం పెట్టబోతున్నాడు అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఎవరు అంతగా నమ్మలేదు. మధ్యలో కొందరు సినీ ప్రముఖులు కూడా సినిమాలకు దూరం కావద్దని తెలిపారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినీ వేడుకలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా పవన్ తెలంగాణలో జరిపిన మీడియా సమావేశంలో డైరెక్ట్ గా సినిమాల గురించి ఇప్పుడు అంతగా ఆలోచించడం లేదని క్లియర్ గా చెప్పాడు. ఇంకా ఎలక్షన్స్ కి ఒక ఏడాది మాత్రమే ఉంది. పైగా ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో నేతలు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. దీంతో పవన్ కూడా సినిమాల గురించి రెండేళ్ల వరకు ఆలోచించే పరిస్థితుల్లో లేడని తెలుస్తోంది.