షాక్ .. చరణ్ సినిమాకు పవర్ స్టార్ టైటిల్ ?

Saturday, October 6th, 2018, 09:52:44 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే అజర్ బైజాన్ లో ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకుని టీమ్ హైదరాబాద్ వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ సినిమా పై ఆసక్తి పెంచుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటో తెలుసా .. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే స్టేట్ రౌడీ, జగదేకవీరుడు అన్న టైటిల్ పెడతారని వార్తలు వచ్చాయి .. తాజాగా మరో టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఆ టైటిల్ ఎదో తెలుసా .. తమ్ముడు ? అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు అదే టైటిల్ ని ఈ సినిమాకు పెట్టేందుకు సిద్ధం అయ్యారట. దానికి కారణం ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ , చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని .. జనరల్ గా హీరో ఆ ఫ్యామిలి ని కష్టాలనుండి కాపాడుతాడు కాబట్టి .. తమ్ముడు అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చరణ్ సినిమాకు పవర్ స్టార్ టైటిల్ పెడతారన్న వార్త సంచలనం రేపుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలి. చరణ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.