ఈయ‌నింత సిగ్గులేకుండా ఎలా న‌టిస్తాడు!

Friday, May 11th, 2018, 02:33:37 AM IST

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ జీవితంలో బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఏదో తెలిస్తే ఫ‌క్కున న‌వ్వేస్తారు. ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా? ఆయ‌నే ది గ్రేట్ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్. స‌రిగ్గా ప‌దేళ్ల క్రింద‌ట జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుని నేల టిక్కెట్ వేదిక సాక్షిగా ర‌వితేజ అంద‌రిముందు చెప్ప‌డం విశేషం.

ర‌వితేజ మాట్లాడుతూ ..జీవితంలో ఎంద‌రో ఎన్నో కాంప్లిమెంట్లు ఇస్తారు. 10 ఏళ్ల క్రితం ప‌వ‌న్ గారితో ఫోన్‌లో మాట్లాడాను. ప‌వ‌న్ ఇచ్చిన కాంప్లిమెంటు.. మీరంత సిగ్గు లేకుండా ఎలా చేశారండీ! బెస్ట్ కాంప్లిమెంట్‌.. ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. .. అని అన్నారు. ఇక ప‌వ‌న్ అదే వేదిక‌పై మాట్లాడుతూ .. “ర‌వితేజ‌పై ఇష్టంతో వ‌చ్చాను. నేను వీధుల్లో తిరుగుతున్న‌పుడే ఆయ‌న‌ను ఒక న‌టుడిగా చూశాను. ద‌గ్గ‌ర‌గా అన్న‌య్య‌గారిని, ఆ త‌ర‌వాత ర‌వితేజ‌నే చూశాను. ఆజ్‌కా గూండా రాజ్ రిలీజైన‌ప్పుడు మ‌ద్రాసులో చూస్తున్న‌ప్పుడు అప్పుడే ర‌వితేజ గారిని చూశాను. నేను యాక్ట‌ర్‌ని కాదు కాబ‌ట్టి, న‌న్ను గుర్తించ‌లేదు కానీ, ఆయ‌న న‌వ్వుల వెన‌క‌, పెర్ఫామెన్స్ వెన‌క చాలా త‌ప‌న‌, క‌ష్టం, కృషి, చెప్ప‌లేని క‌ష్టాల‌తో కూడుకున్న బాధ‌లు ఉన్నాయి. ఒక వ్య‌క్తి ఇంత హాస్య ం పండిస్తున్నాడు అంటే గుండెల్లో ఎంతో కొంత బాధ లేక‌పోతే హాస్య ం పుట్ట‌దు“ అన్నారు.

Comments