ప్రభాస్ “ఓ డియర్” కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

Thursday, February 27th, 2020, 04:08:50 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ చిత్రం “ఓ డియర్” షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం అందిస్తున్నారు.అయితే ఎప్పుడో మొదలు కాబడిన ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటిలానే ఎదురు చూపులు మొదలుపెట్టారు.

అలాగే ప్రభాస్ కూడా ఇదే సినిమా లైన్ లో ఉండగా “మహానటి” లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నాగశ్విన్ తో మరో చిత్రాన్ని కూడా ఒకే చేసేసి తన ఫ్యాన్స్ ను కాస్త ఊరట పరిచాడు.అయితే ఈ సినిమా కన్నా ముందు ఓ “ఓ డియర్” రావాల్సిందే.ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వినిపిస్తుంది.

ఈ సినిమాకు విడుదల తేదీని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట.ఈ ఏడాది ఉగాది తర్వాత పెద్ద పండుగ అయినటువంటి “దసరా” రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో చిత్ర యూనిట్ ఉన్నారని తెలుస్తుంది.అంటే ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 23 అని తెలుస్తుంది.