నిక్కర్ వేసుకొని కథ చెప్పాడు..షాక్ అయ్యాను

Monday, August 19th, 2019, 09:05:41 AM IST

సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో కన్నుల పండగగా జరిగింది. తెలుగు సినీ చరిత్రలోనే ఇలాంటి ఫంక్షన్ ఇక జరగబోదేమో అనే స్థాయిలో భారీగా జరిగింది. ఇక ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ ముఖ్యంగా దర్శకుడు సుజీత్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. సుజీత్ 22 ఏళ్లకే రన్ రాజా రన్ సినిమా తీసాడు. ఆ తర్వాత అతని దగ్గర కథ ఉంటే అది వంశీ-ప్రమోద్ విని నన్ను వినమని చెప్పారు. కాల్ చేసి పిలిస్తే నిక్కర్ వేసుకొని వచ్చి స్టోరీ చెప్పాడు.

చూడటానికి చిన్న పిల్లోడి మాదిరి కనిపించినా కానీ 40 ఏళ్ళ దర్శకుడి స్థాయిలో నాకు స్టోరీ నేరేట్ చేశాడు. అంత ఓకే అయ్యింది, సినిమా షూట్ కి వెళ్లే ముందు ఆరు నెలలు గ్రాండ్ వర్క్ చేశాడు, తీరా మూవీ స్టార్ట్ అయ్యే సమయానికి నాకు వంశీ,ప్రమోద్ కి ఒకటే భయం. సుజిత్ ఏమో చాలా చిన్నవాడు. సినిమాలో పనిచేసే టెక్నిషన్స్ ఏమో పెద్ద పెద్ద సీనియర్లు,వాళ్లతో సుజీత్ ఎలా కలిసి వర్క్ చేయగలడు అనే భయం ఉండేది. కానీ మొదటి రోజే దానిని లేకుండా చేశాడు. వాళ్లతో మంచి అవుట్ ఫుట్ తెప్పించుకున్నాడు.

సుజీత్ ని చూస్తుంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడేమో అనిపిస్తుంది. వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ తప్పకుండా టాప్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళిపోతాడంటూ సుజీత్ గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరిగింది. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు 10 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారంటే ఈ సినిమా రేంజు ఏమిటో ఒక్కసారి అర్ధం చేసుకోండి.. ఆగస్టు 30 మన ముందుకి రాబోతుంది సాహో..జయహో సాహో