గాసిప్స్ : బాస్ వచ్చినా ప్రభాస్ రాడంట..?

Tuesday, March 31st, 2020, 06:16:44 PM IST


ఒక పక్క కరోనా వైరస్ మూలానా అందరు ఇళ్లల్లో కూర్చొని ఒక్కొక్కరికి ఏమీ తోచక పిచ్చి లేస్తుంది. దీనితో ఎంటర్టైన్మెంట్ రంగం వైపు తమ అభిమాన హీరోకు సంబంధించిన కొత్త అప్డేట్ కోసం కానీ ఎదురు చూస్తున్నారు. అలా ఇప్పుడు బాస్ మెగాస్టార్ అభిమానులుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా తమ కొత్త సినిమాల తాలూకా ఫస్ట్ లుక్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

ఈ రాబోయే శ్రీరామ నవమి రోజున మెగాస్టార్ నటిస్తున్న “ఆచార్య” సినిమా ఫస్ట్ లుక్ మరియు ప్రభాస్ నటిస్తున్న “ఓ డియర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రానున్నాయని కొన్ని రోజుల క్రితం బజ్ వినిపించింది. కానీ ఇప్ప్పుడు సీన్ కట్ చేశే డార్లింగ్ ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చే సూచనలు అయితే ఇప్పుడు కనిపించడం లేదని చిరు లుక్ అయితే రావడం కన్ఫర్మ్ అని సమాచారం. దీనితో డార్లింగ్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ తప్పదేమో చూడాలి.