“సాహో” పై వింత వింత ట్రోల్ల్స్.!

Thursday, June 6th, 2019, 05:55:44 PM IST

ఇప్పుడు డార్లింగ్ హీరో ప్రభాస్ తీస్తున్నటువంటి “సాహో” చిత్రం కోసమే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ రెండు రోజులు క్రితమే ఈ సినిమా నుంచి అప్డేట్ ఏదోకటి ఇవ్వాలని సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ చేసేసారు.అయినా సరే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. అయినా సరే వారు ఇంకా అప్డేట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులే సోషల్ మీడియాలో వింత వింత ట్రోల్ల్స్ వేస్తున్నారు.

కొంతమంది సినిమా విడుదలకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నా సరే యూవీ క్రియేషన్స్ వారు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటూనే ఒక సాంగ్ లేదు,టీజర్ లేదు ఏమి లేదు అంటూ వారి ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కుకుంటుంటే మరికొంత మంది అయితే సినిమా ఎలాగో ఆగష్టు 15 న విడుదల అవుతుంది కాబట్టి జూన్ 15న టీజర్ జులై 15న ఏమో ట్రైలర్ ఇక ఆగష్టు 15న ఆఖరుగా సినిమాను విడుదల చేస్తారు మనం అస్సలు తగ్గొద్దు అంటూ వారిలో వారే ట్రోల్స్ వేసుకుంటున్నారు.మొత్తానికి మరి ఎప్పుడు మళ్ళీ అధికారిక అప్డేట్ ను విడుదల చిత్ర యూనిట్ విడుదల చేస్తారో చూడాలి.