“సాహో” టీజర్ కు దెబ్బ పడేలా ఉందే..

Tuesday, June 11th, 2019, 05:24:22 PM IST

ఇప్పుడు ప్రభాస్ అభిమానులు 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.2017 నుంచి ఇప్పటి వరకు వారు ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఆ రోజున కాస్త ఊరట కలిగించేలా ఈ చిత్ర యూనిట్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసేసారు.అసలే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం అందులోనూ భారతీయ సినీ ఇండస్ట్రీలోనే ఈ సినిమా లాంటి యాక్షన్ థ్రిల్లర్ మరోటి లేదు రాబోదు అనే స్థాయిలో నిర్మాణ సంస్థలు మంచి హైప్ ను కూడా క్రియేట్ చేసారు.దీనితో ఈ చిత్ర టీజర్ ఎలా ఉండబోతుంది అని ఒక పక్క అభిమానులు ఆశగా ఎదురు చూస్తూనే మరోపక్క కాస్త టెన్షన్ గానే ఉన్నారట.

ఎందుకంటే ఆ రోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఉండడంతో కాస్త ముందుగానే టీజర్ ను వదిలితే మంచిదని డార్లింగ్ అభిమానులు భావిస్తున్నారు.ఎందుకంటే మ్యాచ్ మొదలయినా కూడా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆగినా క్రికెట్ అభిమానులు మాత్రం అందువల్ల ఆ సమయంలో వచ్చే రికార్డ్స్ వ్యూ తగ్గేందుకు అవకాశం ఉందని అందువల్ల మ్యాచ్ కంటే ముందే విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.