“పుష్ప” యూనిట్ ని చూసి నేర్చుకోమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.!

Saturday, May 23rd, 2020, 10:54:43 PM IST

మన టాలీవుడ్ లో డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సహనానికి తన ప్రతీ సినిమాతో పరీక్ష తప్పడం లేదని చెప్పాలి. బాహుబలి సినిమా నుంచి మొదలు కొని ఇప్పుడు నటిస్తున్న ఓ డియర్ వరకు వారికి పడిగాపులే.

ముఖ్యంగా యూవీ మేకర్స్ పై వారికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” సినిమా ఇలా మొదలు పెట్టారో లేదో అప్పుడే యిట్టె మొత్తం అన్ని కీలక భాషల్లోనూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసారు.

కానీ ఎప్పుడో 2019లో మొదలయ్యిన తమ హీరో సినిమాకు మాత్రం ఇంకా ఫస్ట్ లుక్ కాదు కదా కనీసం చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదని మండి పడుతున్నారు. దీనితో పుష్ప మేకర్స్ ను చూసి యూవీ క్రియేషన్స్ వారు నేర్చుకోవాలి అని సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.