డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చ కోపంలో ఉన్నారు.!

Sunday, May 17th, 2020, 05:53:56 PM IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ చిత్రాలు చేస్తున్నారు. మొదటిది రాధా కృష్ణ దర్శకత్వంలో “ఓ డియర్” అయితే మరొకటి నాగశ్విన్ దర్శకత్వంలో. అయితే ఈ రెండిటిలో రాధా కృష్ణతో మొదలు పెట్టిన చిత్రం కానీ ఆ చిత్ర నిర్మాతలపై కానీ డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు పిచ్చ కోపంగా ఉన్నారు. వీరి సహనానికి తగ్గటుగానే గత సాహో కు పెట్టిన పరీక్షలలానే దీనికి కూడా అప్డేట్స్ ఇవ్వకపోతుండడం వారికి మరింత కోపాన్ని తెప్పిస్తుంది.

దీనితో వారికి గట్టిగానే ప్లాన్ చేసారు. సోషల్ మీడియాలో దేశం అంతటా తెలిసేలా వారిపై నెగిటివ్ ట్రెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. దీనివలన వారికి ఎంత వరకు ఉపయోగం ఉందో కానీ వీరు మాత్రం ఇప్పుడు చాలా కోపంలో ఉన్నారు. అందరి హీరోల సినిమాలు నామ మాత్రంగా అయినా ఏదొక అప్డేట్ తెలుస్తున్నా ఇప్పటి వరకు ఎంతో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి కనీసం ఫస్ట్ లుక్ కూడా వదలకపోవడంతో వీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు.