హాట్ టాపిక్: ప్రభాస్ అభిమానులకు ఈ వెయిటింగ్ తప్పదా?

Monday, March 23rd, 2020, 11:18:16 PM IST

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో అభిమానులకు దూరంగా ఉంది ఎవరంటే ప్రభాస్ అని చెప్పాలి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల కోసం దాదాపు అయిదేళ్ళు సమయం తీసుకున్నారు. ఆ చిత్రాల తర్వాత సాహొ చిత్రానికి కూడా ప్రభాస్ దాదాపు రెండేళ్లు సమయం తీసుకున్నారు. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన తర్వాత ప్రభాస్ సినిమాలని చాలా ఆలస్యం గా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సారి ఎలా అయినా త్వరగా అభిమానులని పలకరించాలనీ భావించినప్పటికీ అది కుదరడం లేదు. తాజాగా కరోనా వైరస్ కారణం గా విడుదల వాయిదా తప్పట్లేదు. ఆగస్ట్ లో రావాల్సిన సినిమాలు సైతం రెండు నెలల విరామం తీసుకొని వస్తున్నాయి. అయితే ప్రభాస్ తన కొత్త సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడానికే చాలా సమయం పడుతుంది. ఇపుడు ఈ విడుదల విషయం లో మరింత సమయం ఆలస్యం కాక తప్పదని తెలుస్తోంది.

అయితే జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20 వ చిత్రం రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.