థియేటర్లలో “సాహో” టీజర్ వెయ్యొద్దంటున్న అభిమానులు.!

Thursday, July 18th, 2019, 02:00:35 PM IST

ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ అభిమానులు గత కొన్నేళ్ల నుంచి ఎదురు దెబ్బలు తింటూనే వస్తున్నారు.ఇప్పుడు వారు ఎంతగానో ఎదురు చూస్తున్నవంటి “సాహో” విడుదల వాయిదా పడిందన్న వార్తలు బలంగా వినిపిస్తుండంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందు అంతా మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఆగష్టు 15కల్లా ప్రేక్షకుల ముందు ఉంచుతామని చెప్తూ అభిమానుల్లో ఆసక్తి రేపారు.

కానీ కానీ హిందీ వెర్షన్ లో థియేటర్ల కొరత కారణాన్ని చూపి మరో 15 రోజులు ఆపి సినిమాను విడుదల చేస్తారు అని అనేక రకాల వార్తలు ఒకపక్క వస్తుంటే మరోపక్క ఏదైనా సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్తే అక్కడ వేసే “సాహో” టీజర్ ను చూసి అభిమానులు మరింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.సినిమాను ఆగష్టు 15 న విడుదల చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ టీజర్ లో 15 బ విడుదల అని చూపించడం ఎందుకు తీసేస్తే ఆ విడుదల తేదీ లేకుండా టీజర్ వెయ్యండి లేదా అసలు టీజరే వెయ్యొద్దు అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.