హాట్ టాపిక్: ప్రభాస్ 20 వ లుక్ అద్దిరిపోయింది అంట!

Sunday, March 22nd, 2020, 09:42:01 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం నుండి ఫస్ట్ లుక్ కోసం అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. రాధాకృష్ణ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఓ డియర్. అయితే రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ భారత్ కి తిరిగి వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ నీ పలు కారణాల వలన బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు కమెడియన్ ప్రియదర్శి గుడ్ న్యూస్ తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా ఈ ఫస్ట్ లుక్ అగిపోనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ తాకిడి తగ్గిన తరువాత ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ లుక్ అడ్డిరిపోయింది అని చెప్పారు. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో సైతం భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతుంది.