స్పెషల్ ఫోకస్ : ప్రభాస్ టాలీవుడ్ రూపు రేఖలనే మార్చబోతున్నారా?

Wednesday, February 26th, 2020, 03:03:45 PM IST

మన తెలుగు సినీ పరిశ్రమలో మరియు తెలుగు చలన చిత్రం ఇన్నేళ్ల ప్రస్థానంను మరో స్థాయికి తీసుకెళ్లబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాసే అని చెప్పాలి.”ఏం చేసి ఎదిగావు అన్నది కాదు ఎదిగాక ఎలా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం” అన్న పదాలకు మన టాలీవుడ్ హీరో ఆరడుగుల ఆజానుబావుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పర్ఫెక్ట్ ఉదాహరణగా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తాను కూడా తన తోటి హీరోలతో సాదా సీదాగానే తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.

అలా మొదలు పెట్టి ఇప్పుడు మొత్తం భారతీయ సినీ ప్రస్థానాన్నే రూల్ చేసే స్థాయికి తనని తాను మలచుకున్నారు.పైకి నవ్వుతూ ఏమి ఎరుగనట్టే కల్మషం లేని మనిషిలా కనపడతాడు కానీ ప్రభాస్ ప్లానింగ్ మాత్రం రాబోయే రోజుల్లో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉండబోతుంది అని చెప్పాలి.ఇందాకా మన చెప్పుకున్న మాట ఏం చేసి ఎదగడం కాదు ఎదిగాక ఎలా బ్రతుకుతున్నాం అన్న పాయింట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రభాస్ ఒక పాన్ ఇండియన్ హీరోగా ఎదగడానికి గల కారణం కంటే ముందు టాలీవుడ్ లో జరిగే ఓ అంశం కోసం మాట్లాడి తీరాలి.

మాములుగా మన స్టార్ హీరోలు కొంత మంది తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటే ఆ తర్వాత సినిమాను స్టార్ దర్శకునితోనే తియ్యాలి అని బలంగా ఫిక్స్ అయ్యిపోతారు.అందుకే తమ స్టార్డం ను కాపాడుకొనేందుకు చాలా సేఫ్ గేమ్ ప్లే చేస్తుంటారు.కానీ ఈ సంప్రదాయాన్ని ప్రభాస్ పూర్తిగా బ్రేక్ చేసేసాడని చెప్పాలి.ఇందాక అనుకున్న పాయింట్ ఇప్పుడు గుర్తు చేసుకుందాం ప్రభాస్ హీరోగా ఎదిగేందుకు అనేక సినిమాలు తోడ్పడ్డాయి.

కానీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి”తో తనకి పాన్ ఇండియన్ హీరోగా అద్భుతమైన స్టార్డం వచ్చింది.ఆ ఒక్క సినిమా వరకే రాజమౌళి పేరు ఆ తర్వాత తన సినీ ప్రస్థానాన్ని ఎలా కట్టుకోవాలి అన్నది ప్రభాస్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా..మాములుగా ఇతర స్టార్ హీరోలే స్టేట్ స్థాయి భారీ హిట్ అందుకుంటేనే నెక్స్ట్ స్టార్ దర్శకునితో సినిమా ప్లాన్ చేస్తారు.కానీ ప్రభాస్ ఆల్ టైం ఇండియన్ చరిత్రలోనే నిలిచిపోయే హిట్టు కొట్టినప్పటికీ తాను ఆ ఫార్ములాను ఎంచుకోలేదు మంచో చెడో..కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టారు.

అలా తాను సుజీత్ తో తీసిన “సాహో” నుంచి ఇప్పుడు “జిల్” ఫేమ్ రాధా కృష్ణతో రాబోతున్న “ఓ డియర్” అలాగే “మహానటి” లాంటి సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన నాగశ్విన్ తో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన తన 21వ చిత్రం వరకు ప్రభాస్ తన సినిమాల ద్వారా కొత్త కొత్త సబ్జెక్టులను దేశ వ్యాప్తంగా తన స్టార్డం ద్వారా అలా వ్యాప్తి చెందించే ప్రయత్నం చేసే విధంగా అడుగులు వెయ్యడం ముమ్మాటికీ మన తెలుగు పరిశ్రమను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నమే అని చెప్పాలి.

రాజమౌళి లాంటి దర్శకునితో సినిమా తీసి మంచి టాలెంట్ ఉండి చిన్న సినిమాలు చేస్తున్న సుజీత్, రాధ కృష్ణ ఇప్పుడు నాగశ్విన్ లాంటి దర్శకులకు ఒక వేరే పాన్ ఇండియన్ హీరో అవకాశాలు ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి.కానీ తన స్టార్డం ను సైతం పక్కన పెట్టి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న ప్రభాస్ నమ్మకాన్ని మరియు అతని ఆత్మ స్థైర్యాన్ని మెచ్చుకొని తీరాలి.ఇదొక్కటేనా తన సినిమాతో పాటుగా తన దర్శకుని పేరు కూడా దేశ వ్యాప్తంగా నానుతూనే ఉంటుంది.

సుజీత్ కు అంటే కాస్త లక్ కలిసి రాక హిట్ కొట్టలేదు కానీ ఒకవేళ పొరపాటున హిట్ టాక్ వచ్చి ఉంటే బాలీవుడ్ బడా హీరోలు మరియు నిర్మాతలు సుజీత్ తో సినిమా చేసేందుకు పిలిచేవారేమో..మరి అప్పుడు ఆ క్రెడిట్ ప్రభాస్ కే వెళ్తుంది కదా?ఇలా ప్రభాస్ ఇప్పుడు మన తెలుగు పరిశ్రమను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం ముందు రోజుల్లో మరింత విజయవంతగా కొనసాగాలని కోరుతూ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా 50 వసంతాలు పూర్తి చేసుకొని ప్రభాస్ తో సినిమాను ప్రకటించిన వైజయంతి మూవీస్ వారికి మరియు దర్శకుడు నాగశ్విన్ పేర్లు దేశ వ్యాప్తంగా వినిపించాలని మా “తెలుగుఇన్” టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.