హాట్ టాపిక్: బాహుబలి ప్రభాస్ కి “రష్యా ఆడియెన్స్ హార్ట్ అవార్డ్”

Thursday, June 18th, 2020, 04:40:51 PM IST

ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం భారత్ లో సంచలనం సృష్టించింది. దర్శక దిగ్గజం జక్కన్న ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చిత్రీకరించారు. బాహుబలి పార్ట్ 2 సైతం భారత అభిమానులని అలరించింది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా గొప్ప రికార్డ్ లను సృష్టించింది. అయితే జాతీయ స్థాయిలో అవార్డలను సైతం అందుకున్న ఈ చిత్రం విదేశాల్లో సైతం తన సత్తా ను చాటుతుంది.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతా లో అద్భుతమైన అవార్డ చేరింది. తాజాగా ఈ చిత్రం రష్యా లోని టెలివిజన్ లో ప్రసారం చేయగా, ఎక్కువ మంది వీక్షించిన చిత్రం గా నిలిచింది. సినీ ప్రేక్షకులను మెప్పించిన విభాగానికి గాను, రష్యా ఆడియెన్స్ హార్ట్ అవార్డ ను ప్రకటించారు. ఈ విషయాన్ని భారత్ లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రభాస్ కి ఈ అవార్డ రావడం పట్ల అక్కడి రష్యా అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ అవార్డ ను అందుకున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ పేరు గాంచారు. అప్పట్లో రాజ్ కపూర్ నటించిన చిత్రాలకు రష్యా లో ఆదరణ ఎక్కువగా ఉండేది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రభాస్ ఆ అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా, పేరు పరంగా తెలుగు చిత్ర పరిశ్రమ కి ఎనలేని కీర్తి నీ తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో పీరియాడిక్ డ్రామా లో నటిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి RRR చిత్రం ను తెరకెక్కిస్తున్నారు.