ప్రభాస్ నేషనల్ స్టార్..ఎనీ డౌట్స్..!

Wednesday, September 18th, 2019, 08:22:13 AM IST

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అల్ ఇండియా స్టార్ అయ్యిపోయాడని అందరు అంటున్నారు. అయితే బాహుబలి వెనుక రాజమౌళి బ్రాండ్ అనేది ఉంది. దాని వలనే సినిమాకి అంతటి క్రేజ్ వచ్చింది. దాని వలన ప్రభాస్ రేంజు పెరిగింది. అలాగని ప్రతి సినిమా రాజమౌళితో చేయలేడు కదా..! అందుకే ప్రభాస్ స్టామినా ఏమిటో తెలుసుకోవాలని, అందరికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సాహో సినిమాని కనివిని రేంజులో చిత్రీకరించారు.

మొదటి రోజే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన కానీ వరల్డ్ వైడ్ దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 155 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. ఒక సౌత్ సినిమా అందులోను ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు సినిమా హిందీలో ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే మాములు విషయం కాదు. సాహో 155 కోట్లు వసూళ్లు సాధించింది అంటే దానికి కారణం ప్రభాస్…అతన్ని చూసే సినిమాకి వచ్చారు జనాలు.

దీన్ని బట్టి గమనిస్తే ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయినట్లే లెక్క. సౌత్ లో సినిమా నష్టాలు మిగిల్చి ఉండవచ్చు కానీ, ఓవరాల్ గా ఏ ఉద్దేశ్యంతో అయితే యువి సంస్థ ఈ సినిమాని తీసిందో ఆ ఉద్దేశ్యం నెరవేరినట్లే అని అనుకోవచ్చు. ఇక నుండి ప్రభాస్ ఏ సినిమా చేసిన కానీ అది నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నా ‘జాన్’ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గానే ఎక్సపోజు అవుతుంది.