ప్రభాస్ ట్రెండ్ మార్చాల్సిందేనా..?

Saturday, July 11th, 2020, 06:26:30 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో స్టార్డం పరంగా చూసుకుంటే పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే అని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే మన దగ్గర మాత్రమే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

కానీ బాలీవుడ్ స్థాయి స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అంటే దాని నుంచి ప్రతీ ఒక్కరు కొత్త దనాన్నే కోరుకుంటున్నారు తప్ప ఎప్పుడో ఆల్రెడీ చూసేసిన అంశాలను కాదు. ఇది సాహో నుంచే ఉంది.

ఆ సినిమా ఫస్ట్ లుక్ నుంచి సినిమా స్క్రిప్ట్ వరకు మన ఫిల్మీ లవర్స్ కు అంతా తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ “రాధే శ్యామ్” ఫస్ట్ లుక్ కూడా ఏమంత ఇంప్రెసివ్ గా లేదు. దీనితో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ప్రభాస్ నుంచి కొత్తదనం కనిపించాల్సిన అవసరం ఉంది.

అప్పుడే ట్రోల్స్ నుంచి బయటపడగలడు. లేదా కొన్నాళ్ళకు ఆడియెన్స్ లో ఇంప్రెషన్ మారే అవకాశాలు లేకపోలేవు. సో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే టీం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.