ప్రభాస్ సినిమా అప్పుడు కూడా రాదా.?

Sunday, May 24th, 2020, 06:05:12 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓ రాధే”. దీని తర్వాత మొదలు పెట్టిన ఎన్నో సినిమాలకు అప్డేట్లు రావడమే కాకుండా రిలీజ్ అయ్యిపోయినవి కూడా చాలానే ఉన్నాయి. అయినప్పటికి ఈ చిత్ర యూనిట్ నుంచి ఏ చిన్న అప్డేట్ కూడా రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోవడంతో ఈ సినిమా కూడా వాయిదా పడింది. దీనితో ఈ ఏడాదిలోపునే విడుదల కావాల్సిన చిత్రం కాస్తా వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి రేస్ లో కూడా వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఎదురు దెబ్బె అని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఓ క్లారిటీ రావాలి అంటే తప్పకుండ చిత్ర నిర్మాణ సంస్థలు నోరు విప్పాల్సిందే.