మరో క్రేజీ డైరెక్టర్ సినిమాకు ప్రభాస్ పచ్చ జెండా.. ఎవరో తెలుసా..!

Tuesday, February 18th, 2020, 11:00:18 PM IST

బాహుబలి సినిమా ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి తరువాత సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో ప్లాఫ్ అయినా కానీ దాదాపు ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుంది.

అయితే జాన్ సినిమా తరువాత ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్టు సమాచారం. అయితే తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు కూడా ప్రభాస్ రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్ ఓ కథను ప్రభాస్‌కి వినిపించాడని, అయితే అందులో చిన్న చిన్న మార్పులు చేశాడని, ప్యాన్ ఇండియా లెవల్‌కు సరిపడా స్క్రిప్ట్‌ లా మార్చాలని నాగ్ అశ్విన్‌కు సజేషన్ ఇచ్చినట్టు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.