ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్… మెనీ ఫెస్టివల్స్ వన్ లవ్!

Tuesday, April 13th, 2021, 08:58:54 AM IST

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్, బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక ఫోటో ను అభిమానులతో శేర్ చేసింది. రాధే శ్యామ్ నుండి చాలా పండుగలు, ఒకటే ప్రేమా అంటూ ప్రభాస్ క్యూట్ స్మైల్ తో ఉన్నటువంటి పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కి సిద్దం అవుతుంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. అభిమానులను టీజర్ ఆకట్టుకుంది. 1960 కాలం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ను తెరకెక్కిస్తున్నారు. ఇది పునర్జన్మ నేపథ్యం లో కొనసాగుతుంది అని, ప్రభాస్ మొదటి సారి ఒక దొంగ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రాన్ని జులై 30 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ ఈ సినిమా కి కూడా చాలా గ్యాప్ తీసుకోవడం తో అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంతో పాటుగా ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం లో నటిస్తున్నారు. ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అంతేకాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్.