అన్ని రికార్డులు తుడిచేసిన “రాధే శ్యామ్”..!

Saturday, July 11th, 2020, 11:51:50 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. రెట్రో లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్ననే విడుదల కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ లేపేశారు.

ట్విట్టర్ లో ఏకంగా 6.3 మిలియన్ టైటిల్ ట్యాగ్స్ 24 గంటల్లో వేసి ఆల్ టైం రికార్డు సెట్ చేశారు. అంతకు ముందున్న మన స్టార్ హీరోల లేటెస్ట్ సినిమా టైటిల్స్ పేరిట ఉన్న రికార్డులను భారీ మార్జిన్ తో కొట్టారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఖాతాలో సౌత్ ఇండియా లోనే హైయెస్ట్ రికార్డ్ పడ్డట్టు అయ్యింది. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.