ప్రభాస్ సంచలన నిర్ణయం – కరోనా బాధితుల సహాయార్థం భారీ విరాళం…

Friday, March 27th, 2020, 09:00:14 AM IST

భారత్ లో భయంకరమైన కరోనా వైరస్ బీభత్సంగా వ్యాపిస్తున్న కారణంగా, ఈ కరోనా బాధితుల సహాయార్థం చాలా మంది ప్రముఖులు తమకు తోచినంత భారీ విరాళాన్ని ప్రభుత్వాలకు అందజేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ లిస్టులో చాలా మంది తెలుగు సినిమా ప్రముఖులు చేరిన విషయం మనకు తెలిసిందే. కాగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా వైరస్ బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని ప్రకటించారు.ఈ మేరకు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు అందించగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి నిధికి చెరొక రూ.50 లక్షలు ప్రభాస్ అందించారు. అంటే దాదాపుగా రూ.4 కోట్లు కరోనా బాధితుల సహాయ నిధికి అందించారని సమాచారం.

తన బాహుబలి చిత్రాన్ని దక్షణాది ప్రజలు ఎంతగానో ఆదరించిన సంగతి తెలిసిందే. కాగా వారందరి సహాయార్థం వారికి భారీ విరాళాన్ని అందజేయడానికి నిర్ణయించుకున్నానని ప్రభాస్ వాఖ్యానించారు. ప్రస్తుతానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఇంత భారీ విరాళాన్ని అందజేసిన నటుడు ఒక్క ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇటీవల తాను నటిస్తున్న తాజా చిత్రానికి సంబందించిన షూటింగ్ ని జార్జియాలో పూర్తి చేసుకొని, ప్రస్తుతానికి తన ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు.