కొత్త బిజినెస్ లోకి… ప్రభాస్ ?

Saturday, October 6th, 2018, 11:06:06 PM IST

ఈ మధ్య సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్స్ కేవలం సినిమాలు మాత్రమే చేయడం లేదు .. అటు బిజినెస్ రంగంలో కూడా తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు బిజినెస్ రంగంలో ఉన్నారు .. తాజాగా మహేష్ కూడా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే దారిలో బాహుబలి తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా కొత్త బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే తన ఫ్రెండ్స్ తో కలిసి యువి క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రాల నిర్మాణం చేస్తున్నాడు. దాంతో పాటు ఇదే బ్యానర్ లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ బానర్ పై థియేటర్స్ బిజినెస్ మొదలు పెట్టనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని థియేటర్స్ ని తీసుకుని మోడరేట్ చేసి, థియేటర్స్ ని సొంతం చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ గా కొన్ని థియేటర్స్ తమ చేతిలో ఉంచుకోవడం బెటర్ అన్న ఆలోచనలో భాగంగా ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ బిజినెస్ ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తాడా .. లేదా దేశవ్యాప్తంగా విస్తరిస్తారా అన్నది చూడాలి.