గుడ్ లక్ సఖి టీజర్ ను లాంఛ్ చేయనున్న ప్రభాస్

Friday, August 14th, 2020, 08:43:51 PM IST


వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్, మరొక లేడీ ఓరియెంటడ్ కథ తో మన ముందుకి రానుంది. గుడ్ లక్ సఖి అంటూ టైటిల్ తో తాజాగా పోస్టర్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ కి ప్రేక్షకులు, అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్ర టీజర్ ను ఆగస్ట్ 15 న ఉదయం 10 గంటలకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్ర టీజర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 15 ఉదయం పది గంటలకు సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్ లో ప్రభాస్ విడుదల చేయనున్నారు. గుడ్ లక్ సఖి అంటూ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ షూటర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు మరియు ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు లో ప్రభాస్ విడుదల చేస్తుండగా, తమిళ్ లో విజయ్ సేతుపతి, మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమారన్ విడుదల చేస్తున్నారు.