మంచితనాన్ని చాటుకున్న ప్రకాష్ రాజ్ – తన సిబ్బందికి మూడు నెలల జీతం చెల్లింపు…

Monday, March 23rd, 2020, 07:00:48 PM IST

భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకు చాలా దారుణంగా వ్యాపిస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ ని ఎలాగైనా సరే అడ్డుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కీలకమైన చర్యలను తీసుకుంటూ పలు నిబంధనలను విధిస్తున్నాయి. కాగా ఈమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు కూడా లాక్ డౌన్ పాటించాలని తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమాలు, సినిమా షూటింగులు, వ్యాపారాలు, నిత్యావసరాలు అన్ని కూడా అక్కడికక్కడే నిలిచిపోయాయి… అయితే ఆ ప్రభావం అనేది రోజు వారి కూలీలపై చాలా అదనంగా పడుతుంది. ఇప్పటికే పలువురు తమ ఉపాధిని కోల్పోయారు కూడా…

అయితే ఈ మేరకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సందర్భంగా తమ ఉపాధిని కోల్పోయిన వారికి అండగా నిలవడానికి సాయం చేయాలనీ తలచిన ప్రకాష్ రాజ్… తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు ఇళ్లు, ప్రొడక్షన్ కంపెనీ, ఫౌండేషన్‌ ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేశారు. అంతేకాకుండా తాను ప్రస్తుతానికి నటిస్తున్నటువంటి సినిమాలకు పని చేస్తున్న రోజు వారీ వర్కర్లకు కూడా సగం జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అంతేకాకుండా తనకు సాధ్యమైనంతవరకు కూడా వారికి సహాయం చేస్తానని ప్రకాష్ రాజ్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు.