మే వరకు తన సిబ్బందికి జీతాలు ఇచ్చిన ప్రకాష్ రాజ్.. మీరూ ఆలోచించండి..!

Tuesday, March 24th, 2020, 01:40:06 AM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే ఇందులో భాగంగా రోజు వారి కూలీలకు, పేదలకు తక్షణ సహాయం అందించేందుకు ఆయా ప్రభుత్వాలు కసరత్తులు చేపట్టాయి. అంతేకాదు ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈ వారం రోజులపాటు పనితో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని ప్రైవేట్ యాజమాన్య సంస్థలకు విజ్ఞప్తి చేసాయి.

అయితే ప్రస్తుతం ఈ కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడింది. ఇప్పటికే అన్ని సినిమా షూటింగ్‌లను వాయిదా వేయడంతో చిత్ర పరిశ్రమలో రోజు వేతనదారులుగా పనిచేసే కార్మికులు పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపధ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ తన సిబ్బందికి మే వరకు జీతాలు చెల్లించారు. అయితే ఇంట్లో, ఫార్మ్ హౌస్ లో, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికి, నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశానని, నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించానని అన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయని అందుకే దినసరి వేతన కార్మికులకు కూడా సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపాడు. అయితే నా శక్తి మేరకు నేను సాయం చేస్తానని, మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే మీ చుట్టూ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. వారి గురుంచి కూడా ఒక్కసారి ఆలోచించండి అని అన్నారు.