ఆ వెబ్‌సైట్‌పై ప్ర‌కాష్‌రాజ్ ఫిర్యాదు

Thursday, April 5th, 2018, 11:12:20 PM IST


విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ బెంగ‌ళూరు కేంద్రంగా ర‌న్ అవుతున్న‌ ఓ ప్ర‌ముఖ వెబ్‌సైట్‌పై పోలీస్ కేసు పెట్టడం సంచ‌ల‌న‌మైంది. గ‌త కొంత‌కాలంగా స‌ద‌రు వెబ్‌సైట్ త‌న‌పై పుంఖానుపుంఖాలుగా త‌ప్పుడు క‌థ‌నాలు వండివార్చింద‌ని, త‌న‌పై చెడుగా రాయ‌డం వ‌ల్ల‌నే ఇలా సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల్ని సంప్ర‌దించాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌కాష్‌రాజ్ వెల్ల‌డించారు.

“జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్యోదంతం అనంత‌రం త‌న ఇంటికి వెళ్లాను. అలాంటి టైమ్‌లో అస‌లే సంబంధం లేకుండా `నా కొడుకు చ‌నిపోతే ఏడ్చానని, డ్యాన్స‌ర్‌తో ఎక్క‌డికో వెళ్లాన‌“ని రాసింది ఆ వెబ్‌సైట్‌. భాజ‌పా ఎంపీల త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ నేను మాట్లాడిన‌ప్పుడు నాపై చెత్త వార్త‌ల్ని రాసింది ఆ వెబ్‌.. అని ఫైర‌య్యారు. ప్ర‌కాష్‌రాజ్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్నార‌న్న వార్త‌ల న‌డుమ‌.. ఈ త‌ర‌హా వివాదం ర‌చ్చ‌కెక్క‌డం ఆయ‌న అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఇక మ‌రోవైపు ప్ర‌కాష్‌రాజ్ న‌టించిన `మ‌హాన‌టి` వ‌చ్చే నెల‌లో రిలీజ్‌కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments