సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రిన్స్ “మహేష్” కొత్త లుక్స్..!

Tuesday, October 23rd, 2018, 07:04:54 PM IST

మాస్ ప్రేక్షకులని,క్లాస్ ప్రేక్షకులని ఒక పక్క కుటుంబ ప్రేక్షకులని మరీ ముఖ్యంగా అమ్మాయిల మనసు దోచుకున్న టాలీవుడ్ హీరోల్లో “ప్రిన్స్” మహేష్ బాబు ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటారు.నాలుగు పదుల వయసు మీద ఉన్నా సరే ఇంకా యువ హీరోలానే కనిపించడం మహేష్ ప్రత్యేకత.సినిమా సినిమా కి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకుంటూ తన అభిమానులను మహేష్ ఎప్పుడు అలరిస్తుంటారు.కొన్ని వరుస పరాజయాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి “భరత్ అనే నేను” సినిమాతో మళ్ళీ తానేంటో బాక్సాఫీస్ వద్ద మహేష్ నిరూపించుకున్నారు.

ఆ తర్వాత మళ్ళీ వినూత్న చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లితో “మహర్షి” అనే చిత్రాన్ని మొదలు పెట్టి,అందులోను సరికొత్తగా గడ్డం లుక్ తో టీజర్ తో అలరించి మంత్రముగ్ధుల్ని చేశారు.ఆ తర్వాత అలా ఆ చిత్రం షూటింగ్ కొనసాగుతున్నా ఈ మధ్య విడుదలైనటువంటి కొన్ని లుక్స్ ని చూసి మహేష్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు మహేష్ యొక్క ఈ కొత్త లుక్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఈ ఫొటోల్లో మహేష్ మరింత ఫ్రెస్ లుక్ తో మరో కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనిమివ్వడంతో ఇక అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments