బాయ్ ఫ్రెండ్ తో ప్రియాంక షికార్లు ?

Wednesday, October 3rd, 2018, 10:48:35 AM IST

బాలీవుడ్ హాట్ భామ ప్రియాంకా చోప్రా గత కొన్ని రోజులుగా ఘాటు ప్రేమాయణంలో ఉందన్న విషయం తెలిసిందే . ఇప్పటికే ప్రియుడితో కలిసి జోరుగా షికార్లు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్ లోని జోధాపూర్ మెహ్రాన్ ఘడ్ కోటను సందర్శించారు. వీరిద్దరి కలిసి రావడంతో అక్కడ జనాలు షాక్ అయ్యారు. ఇంతకీ ప్రియాంక అందుకు ఆ కోటను ప్రియడుతో కలిసి సందర్శించింది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏందుకంటె ప్రియాంకా చోప్రా , అతని బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్ ను త్వరలోనే వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉందట .. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని జోధాపూర్ కోటాలో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే అక్కడ కోట ఎలా ఉంది, ఆ అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు అక్కడికి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.