బాలకృష్ణను పిలవకపోవడం బాధాకరం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్..!

Friday, May 29th, 2020, 02:31:16 AM IST

నేడు ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన బాలకృష్ణ చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పరిణామాలు, చిత్రీకరణలు, ఇతర అంశాల గురించి స్పందించారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిశారని కనీసమ ఆ చర్చలకు తనను ఎవరూ పిలవలేదని వార్తలు, పేపర్ల ద్వారా ఆ విషయం నాకు తెలిసిందని అన్నారు. అంతేకాదు సినిమా పరిశ్రమ చర్చల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారని ఆరోపించారు.

అయితే బాలయ్య చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీలోని పలువురు తప్పుపడుతుంటే, కొందరు మాత్రం బాలయ్యకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమీక్షకు బాలకృష్ణను పిలవకపోవడం దారుణమని అన్నారు. సీనియర్ హీరోగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ప్రొడ్యూసర్ మెంబర్ అని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కూడా ప్రొడ్యూసర్ మెంబర్ అని అల్లంటి వ్యక్తిని కనీసం సమావేశానికి పిలవకపోవడం దారుణమని అన్నారు.