పవన్ పింక్ రీమేక్ వచ్చేది అప్పుడే – స్పష్టం చేసిన దిల్ రాజు…

Sunday, February 9th, 2020, 04:39:24 PM IST

ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ సినిమాల్తో బిజీగా గడుపుతున్నాడు. కాగా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హిందీలో విజయం సాదించినటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దిల్ రాజు తాజాగా పవన్ చేస్తున్న పింక్ రీమేక్ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చెప్పేశారు. అయితే ఇటీవల దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కినటువంటి జాను చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర బృందం అంత కూడా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది.

వారి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రం ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది, మార్చ్ లో ట్రైలర్ వస్తుంది. అంతేకాకుండా మే నెలలో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. త్వరలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని దిల్ రాజు వాఖ్యానించారు.