“మహర్షి”..ఓవర్సీస్ రైట్స్ అంతా..?

Wednesday, March 13th, 2019, 07:21:53 PM IST

ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహర్షి”.ఇప్పటికే ఈ సినిమా కోసం బయటకు వస్తున్న వార్తలను ఆధారంగా ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అలాగే ఇక సూపర్ స్టార్ మహేష్ కోసం కొత్తగా చెప్పేది ఏముంది..హిట్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షమే.ఇక మహేష్ కి ఉన్న ఓవర్సీస్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినా సరే అలవోకగా 1 మిలియన్ మార్కును మహేష్ ఇట్టే అందేసుకుంటారు.అందుకు తగ్గట్టుగానే ఈ ఇప్పటికే ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.దాని వల్లనే ఈ సినిమాకి బిజినెస్ జరుగుతుందని సమాచారం.

ఈ సినిమాని వైజయంతి మూవీస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా పై ఉన్న అంచనాలకు అనుగుణంగా వీరు ఓవర్సీస్ లో మహేష్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని మంచి ఫ్యాన్సీ రేటునే చెపుతున్నారట.ఈ సినిమాను ప్రొడ్యూసర్లు 18-20 కోట్లకు ఇచ్చేందుకు ఆఫర్ పెట్టినట్టు సమాచారం.మరీ ఇంతా అంటే అంటే ఇది మహేష్ కి తక్కువే అని చెప్పొచ్చు,ఒకవేళ అక్కడ మహేష్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో “భరత్ అనే నేను” సినిమా చూపించింది.మరి ఈ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చినట్టయితే అంతకు మించే వసూళ్లు రాబట్టినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు.మరి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఏమంటారో చూడాలి.ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 9న విడుదల కానుంది.