మహేష్ ను అనే ముందు ఓ సారి చరిత్ర చెక్ చేస్కో పూరి.!

Friday, July 19th, 2019, 03:05:56 PM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ దర్శకులు మరియు హీరోలలో కొన్ని కాంబినేషన్లకు కొంత సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు.అలాంటి ఒక సంచలన కాంబినేషనే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఒకటి(పోకిరి) విడుదల అయిన తర్వాత టాలీవుడ్ రికార్డుల్లో ప్రకంపనలు రేపితే ఆ తర్వాత తీసిన “బిజినెస్ మేన్” విడుదలకు ముందే మొత్తం టాలీవుడ్ సహా హిందీ సినిమాలను కూడా షేక్ చేసింది.అయితే వీరిద్దరూ కూడా భారీ హిట్లు ప్లాపులు చూసిన వాళ్ళే కానీ తాజాగా మహేష్ పై పూరి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏ మాత్రం సమంజసంగా అనిపించడం లేదని చెప్పాలి.

ఎందుకంటే పూరి తన “జనగణమన” డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ ప్రస్తావన వచ్చింది.ఈ సినిమా కోసం మహేష్ తో చెయ్యమని మహేష్ అభిమానుల నుంచి తనకు చాలా కాల్స్ వచ్చాయని కానీ మహేష్ మాత్రం తాను తనకి హిట్లు ఉన్నప్పుడు మాత్రమే తనని పట్టించుకుంటాడని లేకపోతే పట్టించుకోరు అన్నట్టుగా మాట్లాడారు.పూరి ఏ మైకంలో ఉండి ఈ మాటలు మాట్లాడారో కానీ ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పాలి.అందుకోసం మాత్రం తప్పకుండా పూరి చరిత్రను ఓసారి తిరగెయ్యల్సిందే..

మహేష్ తో పూరి జగన్నాథ్ “పోకిరి” సినిమా చెయ్యకముందు “ఆంధ్రావాలా”, “143” మరియు “సూపర్” వంటి సినిమాలు తీసారు.ఈ మూడు సినిమాలు ఆ టైంలో ఎలాంటి ఫలితాన్ని చవి చూసాయో కూడా అందరికి తెలుసు.ఆ తర్వాత మహేష్ తో తీసిన “పోకిరి”యే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇది పక్కన పెడితే “బిజినెస్ మేన్” చిత్రం విషయానికి వచ్చినట్టయితే దానికి ముందు “ఏక్ నిరంజన్”, ‘గోలీమార్” అలాగే “నేను నా రాక్షసి” వంటి సినిమాలు తీశారు.ఈ సినిమాలు అయితే ఇండస్ట్రీలో ఎంత గట్టిగా ఆడేసాయో చెప్పక్కర్లేదు.మళ్ళీ ఆ తర్వాత మహేష్ తో సినిమా ప్రకటించగానే అప్పుడు పూరికి ఎక్కడ లేని హైప్ వచ్చింది.దీన్ని బట్టి ఎవరు ప్లాపుల్లో ఉన్నపుడు ఎవరు అవకాశాలు ఇచ్చారో పూరి ఓ సారి గత చరిత్ర తిరగేసి చూసుకొని మాట్లాడితే బెటర్.