ఆ నిమిషం పూరి లైఫ్‌లో గేమ్ ఛేంజ్ వెన‌క‌!

Tuesday, September 20th, 2016, 05:41:57 PM IST

puri-jaganth
జాగ్వార్ ఫేం నిఖిల్ కుమార్ ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. నిఖిల్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌. అందుకే తెలుగు, క‌న్న‌డ‌లో ఘ‌నంగా లాంచ్ అవుతున్నాడు. అయితే తొలుత నిఖిల్ కుమార్‌ని లాంచ్ చేసేందుకు టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రేసులో ఉన్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అయితే అనూహ్యంగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ పేరు తెర‌పైకొచ్చింది. విజ‌యేంద్రుని క‌థ ఓకే అయ్యింది. రాజ‌మౌళి శిష్యుడు మ‌హ‌దేవ్ లైన్‌లోకొచ్చారు. అయితే ఆ మ‌ధ్య‌లో ఏం జరిగింది? అన్న‌దానికి ఇంత‌కాలం క్లారిటీ లేదు. ఆ విష‌యంలో ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది. జాగ్వార్ నిర్మాత కుమార‌స్వామి తెలుగు మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

వాస్త‌వానికి పూరి జ‌గ‌న్నాథ్ ఓ మంచి ల‌వ్‌స్టోరితో వ‌చ్చారు. కానీ అది నిఖిల్ కుమార్‌కి యాప్ట్ అని అనిపించ‌లేదు. త‌న బాడీ లాంగ్వేజ్ ప్ర‌కారం యాక్ష‌న్ స్టోరి అయితే బావుంటుంద‌నిపించింది. ఈ లోగానే విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారు
చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో పూరి కంటే ముందే విజ‌యేంద్రుని క‌థ‌తో జాగ్వార్ సినిమా సెట్స్‌కెళ్లింది. ఈ విష‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ గారిని రిక్వ‌స్ట్ చేసి ఒప్పించాం. పూరితో నిఖిల్ కుమార్‌ రెండో సినిమా ఉంటుందని చెప్పారు. ఇప్పుడ‌ర్థ‌మైందా? ఆ క్ష‌ణం ఏమైందో? మొత్తానికి నిఖిల్ కోసం పూరి మ‌రో మైండ్ బ్లోవింగ్ స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని కుమార‌స్వామి మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.