మహేష్ తో భారీగా ప్లాన్ చేయనున్న పూరి.?

Tuesday, June 23rd, 2020, 03:48:30 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక మాస్ స్టార్డం ను అందించిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అని చెప్పాలి. మొట్ట మొదటిసారిగా తెలుగు బాక్సాఫీస్ దగ్గర 40 కోట్ల షేర్ మార్కును టచ్ చేసి ఈ చిత్రం ఎన్నో ఆల్ టైం రికార్డులను నెలకొల్పింది.

అలాంటి హిట్ అందుకున్న ఈ కాంబో నుంచి మరో సినిమా అంటే ఆ హైప్ వేరేలా ఉంటుంది. కానీ తర్వాత ప్లాన్ చేసిన “బిజినెస్ మెన్” అన్ని అంచనాలను అయితే నెలకొల్పుకోగలిగింది కానీ ఆ స్థాయి హిట్ కాలేదు. కానీ వీరి నుంచి మాత్రం ఒక సినిమా కొమ్మా మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ గా “జనగణమణ” అనే సబ్జెక్టును ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.అయితే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మహేష్ తో తీస్తానని పూరి మరోసారి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాగా తీసే యోచనలో పూరి ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.