మహేష్ 25వ సినిమాకి పివిపి ఎంట్రీ?

Thursday, May 24th, 2018, 06:08:15 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25వ చిత్రం ప్రారంభోత్సవం కొన్ని నెలల క్రితం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజా చిత్రం భరత్ అనే నేను అద్భుత విజయం అందుకోవడంతో, ఆనందంలో వున్న మహేష్ బాబు, ప్రస్తుతం తన కుటుంబం తో కలిసి స్పెయిన్ కి విహార యాత్రకు వెళ్లారు. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ చిత్రం జూన్ లో పట్టాలెక్కనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తొలుత నిర్మాతగా పివిపి ఉంటారని వార్తలొచ్చాయి. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని నిర్మించి పివిపి ఆ చిత్రం ఘోర పరాయజయం పాలవడంతో మహేష్ పివిపికి మరొక సినిమా చేస్తానని మాటిచ్చినట్లు సమాచారం. కాగా ఆయన 25వ సినిమాని పివిపికే మహేష్ అప్పగించారని అందరూ అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆ అవకాశం ఆయన దిల్ రాజు, అశ్వినిదత్ లకు ఇవ్వడంతో ఈ విషయమై కోర్ట్ కి ఎక్కిన పివిపి మహేష్ కు కూడా నోటీసు లు జారీ చేసాడు. అయితే మహేష్, తాను చెప్పిన ప్రకారం 2018లోగా తాను పివిపికి ఒక చిత్రాన్ని చేసిపెడతాను అన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ చిత్రానికి నిర్మాతలుగా వున్న దిల్ రాజు, అశ్విని దత్ సహా పివిపిని కూడా చిత్రంలో భాగస్వామిని చేయాలని భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం. అలా చేయడం వల్ల పివిపి ఇక కోర్ట్ కి వెళ్లే అవసరం ఉండదని, చెప్పినట్లుగా తనకు ఒక సినిమా కూడా చేసినట్లు ఉంటుందని మహేష్, ఆయన భార్య నమ్రతలు భావిస్తున్నారని టాక్. అయితే పివిపిని ఈ చిత్రంలో నిర్మాతల్లో ఒకరిగా చేర్చుతారా లేక, స్లీపింగ్ పార్టనర్ గా ఉంచుతారా అనేది మాత్రం తీలాల్సి ఉందట. కాగా ఈ విషయమై వారి నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది…….

  •  
  •  
  •  
  •  

Comments